32 మంది మెడికల్ స్టూడెంట్లకు గంజాయి పాజిటివ్

by Muthe.Rajitha |

ప్రజలు ఆరోగ్యాలను బాగు చేయాల్సిన వైద్యులే గంజాయి సేవిస్తున్నారని నార్కోటిక్స్ పోలీసుల పరీక్షల్లో బయట పడింది.

32 మంది మెడికల్ స్టూడెంట్లకు గంజాయి పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో డ్రగ్స్(Drugs) వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. మరోవైపు డ్రగ్స్ వాడకం మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన సంఘటన నార్కోటిక్స్ పోలీసులే కాదు, యావత్ సమాజం విస్తు పోయేలా చేసింది. ప్రజలు ఆరోగ్యాలను బాగు చేయాల్సిన వైద్యులే గంజాయి సేవిస్తున్నారని నార్కోటిక్స్ పోలీసుల పరీక్షల్లో బయట పడింది. నగరంలోని ఓ మెడికల్ కాలేజీ విద్యార్థులు(Medical Students) తరుచూ గంజాయి సేవిస్తున్నారని సమాచారం అందటంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని కళాశాలలోని మెడికల్ స్టూడెంట్స్ అందరి బ్లడ్ శాంపుల్స్ సేకరించి, పరీక్షలు నిర్వహించగా వారిలో ఏకంగా 32 మంది మెడికోలు గంజాయి పాజిటివ్స్ గా తేలారు. అయితే వీరిలో ఇద్దరు మహిళా మెడికోలు కూడా ఉండటం పోలీసులను షాక్ కు గురి చేసింది. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై పోలీసులు గాని, కాలేజీ యాజమాన్యం గాని ఇంకా స్పందించలేదు.

Next Story