200కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం.. అరెస్ట్

by Bhanu |

కల్తీ నెయ్యి విక్రయిస్తు ప్రజారోగ్యానికి హాని చేస్తున్న ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సెకండ్ బజార్ కు అన్నమలై మోండా మార్కెట్ లో టిఫిన్ సెంటర్ ను నడిపిస్తున్నాడు.

200కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం.. అరెస్ట్
X

దిశ, సిటీ క్రైం: కల్తీ నెయ్యి విక్రయిస్తు ప్రజారోగ్యానికి హాని చేస్తున్న ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సెకండ్ బజార్ కు అన్నమలై మోండా మార్కెట్ లో టిఫిన్ సెంటర్ ను నడిపిస్తున్నాడు. ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో అన్నమలై ఆవు నెయ్యికు ఉన్న డిమాండ్ ను గుర్తించాడు. దీంతో కొబ్బరినూనె, డాల్డా, ఇతర ఫుడ్ కలర్స్ ను కలిపి కల్తీ ఆవు నెయ్యిని తయారు చేస్తున్నాడు. దానిని ఒక లీటరు ప్యాకెట్ లుకా బ్రాండింగ్ చేసి లీటర్ ధర రూ.600లకు విక్రయిస్తూ మోసం చేస్తున్నాడు. అదేవిధంగా కల్తీ చేయడం వల్ల ప్రజారోగ్యానికి హాని చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అన్నమలై ఇంట్లో సోదాలు జరిపి 200 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.

Next Story