- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

దిశ, హిమాయత్‌నగర్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బషీర్ బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి కృష్ణయ్య ర్యాలీ చేపట్టారు. అనంతరం బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శిగా గంజి ప్రసాద్ కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. నిరుద్యోగ యువత కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక పెళ్లిళ్లు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలు లేవంటూ ఉద్యోగ నోటిఫికేషన్ లు వేయడం లేదని, రాష్ట్రంలో 4 లక్షలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే 18 వేల పోలీస్ శాఖలో ఉన్న ఉద్యోగాలు, 30 వేల టీచర్ పోస్టులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం ఏపీ అధ్యక్షులు నాగేశ్వర్ రావు, మహిళా ఇంచార్జి నూకాలమ్మ, తెలంగాణ నేతలు అనంతయ్య, రాజేందర్, జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్ పాల్గొన్నారు.






