18 మంది దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు

by Bhanu |

పారదర్శకంగా దివ్యాంగ అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామాక పత్రాలు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

18 మంది దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : పారదర్శకంగా దివ్యాంగ అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామాక పత్రాలు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దివ్యాంగులకు కేటాయించిన 37 బ్యాక్ లాగ్ పోస్టులకు గాను అర్హతలు ఉన్న 18 మందికి వివిధ కేటగిరీలలో ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు గాను 2018- 19 లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, తదుపరి వివిధ కారణాలతో నియామక ప్రక్రియ పూర్తికాలేదని కలెక్టర్ చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టులలో 18 మాత్రమే ప్రస్తుతం ఖాళీలుగా గుర్తించడం జరిగిందని, వీటిల్లో అర్హులైన వివిధ వర్గాల దివ్యాంగ అభ్యర్థులను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు.


దివ్యాంగుల అర్హత తుది జాబితాను ఈ నెల 23న ప్రకటించామన్నారు . ఉద్యోగాలు సాధించిన దివ్యాంగులు జీవితంలో స్థిరపడాలని, దివ్యాంగులు ఉద్యోగం సాధించడం అనేది ఒక గొప్ప అంశమని, నూతన ఉద్యోగం పొందిన వారు జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించడంతో పాటు వారిని అభినందించారు. అర్హుల ఎంపిక ప్రక్రియు పారదర్శకంగా చేపట్టిన డిఆర్ఓ ఈ. వెంకటాచారి, జిల్లా సహాయ సంచాలకులు రాజేందర్, జహురుద్దీన్ లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story