హైదరాబాద్ లో 11.5 కేజీల గంజాయి స్వాధీనం

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని చైతన్యపురిలో భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది.

హైదరాబాద్ లో 11.5 కేజీల గంజాయి స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని చైతన్యపురిలో భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. చైతన్యపురిలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర 300 గ్రాముల గంజాయి లభ్యం అయింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తాను అబ్బాస్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్టు తెలపగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని 850 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అబ్బాస్ ను మరింత విచారిస్తే మమత అనే మహిళ చిరునామా తెలుపగా.. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 10 కేజీల గంజాయి లభ్యం అయింది. వీరి ముగ్గురి దగ్గర 11.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Next Story