- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సవతి తండ్రి దాడిలో 11 ఏళ్ల బాలుడు మృతి
నగరంలోని చాంద్రాయణగుట్ట పరిధిలోని జీఎం కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సవతి తండ్రి చేసిన అమానుష దాడిలో 11 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దిశ, చంపాపేట్: నగరంలోని చాంద్రాయణగుట్ట పరిధిలోని జీఎం కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సవతి తండ్రి చేసిన అమానుష దాడిలో 11 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం సుమారు 1గంటల సమయంలో జీఎం కాలనీలోని ఇంటి వద్ద బాలుడు మొహమ్మద్ అస్గర్‌పై అతని సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై బాలుడి తల్లి నఫీస్ బేగం (31) ఫిర్యాదు మేరకు చంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన అనంతరం నిందితుడు షేక్ ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు సమాచారం. కేసు దర్యాప్తును దర్యాప్తు అధికారి ఎస్.చంద్ర రెడ్డి చేపట్టారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






