- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dubai: బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ మహిళ డ్రగ్స్ కేసులో జైలు పాలు
ఇటీవల దుబాయ్‌కు వెళ్లిన ఓ భారతీయ మహిళ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Dubai) ఇటీవల దుబాయ్‌కు వెళ్లిన ఓ భారతీయ మహిళ (drug case) డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన 24 ఏళ్ల మహిళ వద్ద అక్రమ మాదకద్రవ్యాలు ఉన్న బ్యాగ్‌ను అధికారులు కనుగొన్నారు. ఈ క్రమంలోనే ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే, హైదరాబాద్‌లోని కిషన్ బాగ్‌కు చెందిన అమీనా బేగం (Ameena Begum), ఉద్యోగం కోసం స్థానిక ట్రావెల్ ఏజెంట్ ఆధ్వర్యంలో మే 18 వ తేదీన దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమీనా తల్లి సుల్తానా బేగం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) కు తాజాగా లేఖ రాసింది. తన కూతురు అమీనా దుబాయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు ఆమె తీసుకెళ్లిన బ్యాగులో మాదకద్రవ్యాలను అధికారులు గుర్తించి ఆమెను అరెస్టు చేశారని తెలిపారు. అమీనాకు ఆ బ్యాగ్‌లోని విషయాల గురించి తెలియదని, దుబాయ్‌లో ఆ బ్యాగును ఎవరికో ఇవ్వాలని అడిగారని తల్లి లేఖ పేర్కొన్నారు. అమీనా జైలు నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిందన్నారు.
తన కూతురిని సురక్షితంగా తిరిగి స్వదేశానికి తీసుకురావాని విదేశాంగ శాఖను విజ్ఞప్తి చేశారు. అబుదాబిలోని భారత కార్యాలయం, దుబాయ్‌లోని కాన్సులేట్ సహాయం చేయాలని, తన కూతురికి చట్ట పరమైన సహాయం, ఆమె విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరింది. అమీనా ఐదేళ్ల కుమారుడు సైతం ఉన్నాడని, తల్లి వెళ్లిన తర్వాత పిల్లవాడు అనారోగ్యానికి గురయ్యాడని పేర్కొంది. అమీనా తనకు తెలియకుండానే డ్రగ్స్ అక్రమ రవాణా చేసి ఉండొచ్చని కుటుంబం భావిస్తోంది. ఉద్యోగ ఆఫర్ ఏర్పాటు చేసిన స్థానిక ఏజెంట్‌పై దర్యాప్తు చేపట్టాలని అమీనా కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.






