- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్-విజయవాడ హైవేపై హయత్‌నగర్ వాసుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హయత్ నగర్ (Hayathnagar) వాసులు మెరుపు ఆందోళనకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ (Hayathnagar) వాసులు మెరుపు ఆందోళనకు దిగారు. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డగోలుగా పనులు చేపడుతున్నారని, ఫలితంగా చాలా మంది రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించి హైదరాబాద్-విజయవాడ హైవేపై హయత్‌నగర్ పరిధిలో పలుచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot over bridges)లను యుద్ధ ప్రాతిపదికన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అయితే, ఆందోళనలో స్థానిక కార్పొరేటర్లతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ అనూహ్య పరిణామంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. స్పాట్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.






