- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడి పిల్లల సురక్షిత ప్రయాణమే లక్ష్యం: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్
బడి పిల్లల ప్రయాణ భద్రతపై రవీంద్రభారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నత స్థాయి భేటీ.. 12 లక్షల మంది విద్యార్థుల రక్షణే ధ్యేయం!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన విద్యా సంవత్సరం (New academic year) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతే పరమావధిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఒక ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి (IAS), జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ (IAS), హైదరాబాద్ సీపీ సజ్జనార్ లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల సురక్షిత రవాణాపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దాదాపు 3,800 పాఠశాలల్లో చదువుతున్న సుమారు 12 లక్షల మంది విద్యార్థుల భద్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పిల్లల క్షేమమే లక్ష్యంగా పాఠశాల యాజమాన్యాలు పని చేయాలని, విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలలో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రైవర్ల ఫిట్‌నెస్, వాహనాల కండిషన్, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోకపోవడం వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, విద్యాసంస్థలు, రవాణా శాఖ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేసి ప్రమాద రహిత ప్రయాణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.






