- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్బీ స్టేడియం సభతో నగరంలో ట్రాఫిక్ జామ్.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్ నగరం శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ రద్దీలో కూరుకుపోయింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ

దిశ, కార్వాన్: హైదరాబాద్ నగరం శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ రద్దీలో కూరుకుపోయింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభ ప్రాంతమైన ఎల్బీ స్టేడియంతో పాటు అసెంబ్లీ, హిమాయత్‌నగర్, అబిడ్స్, నాంపల్లి, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేట్, లకిడికాపూల్, ట్యాంక్‌బండ్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి.
ఇటు కార్యాలయాలు, అటు కళాశాలల నుంచి ఇంటికి బయల్దేరిన ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్‌లో గంటల తరబడి ఇరుక్కున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించినప్పటికీ వాహనాల రద్దీని నియంత్రించలేకపోయారు. అటూ, ఇటూ తిరుగుతూ ట్రాఫిక్ ముందుకు సాగక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పౌరులు విమర్శిస్తూ.. పెద్ద సభలు నిర్వహించాలంటే, ముందుగానే పటిష్టమైన ట్రాఫిక్ ప్లాన్ ఎందుకు ఉండదాని ప్రశ్నిస్తున్నారు.






