- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడికల్ టూరిజం కేపిటల్‌గా హైదరాబాద్ : మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం కేపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని వైద్య..

- ఈశాన్య రాష్ట్రాలకు ఆరోగ్య సహకారానికి తెలంగాణ సిద్ధం
- తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఆరోగ్య సదస్సులో మంత్రి రాజనర్సింహ
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం కేపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు అవసరమైన ఏ స్థాయి ఆరోగ్య సహకారానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో జరుగుతున్న ఆరోగ్య సదస్సులో బుధవారం మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రాలు వేరు అయినా దేశ పౌరులుగా అందరం ఒక్కటేనని, ఆరోగ్యరంగంలో పరస్పర సహకారం దేశ అభివృద్ధికి కీలకమని మంత్రి అన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో బంధాన్ని బలోపేతం చేయడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రైమరీ, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవఖాన్ల ద్వారా ప్రివెంటివ్ అండ్ ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ అందిస్తున్నామన్నారు. సెకండరీ లెవల్‌లో (184) కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లలో స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా వంటి 48 టీచింగ్ హాస్పిటళ్ల ద్వారా టెర్షియరీ కేర్ సేవలు అందుతున్నాయని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఉస్మానియా నూతన హాస్పిటల్, హైదరాబాద్‌లో 3 టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ నిర్మిస్తున్నామని తెలిపారు. 32 డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ద్వారా ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేషెంట్లకు ఉచిత, నాణ్యమైన డయాగ్నస్టిక్స్ సేవలు అందిస్తున్నామని.. ఈ సేవలను ట్రైబల్ ప్రాంతాల్లోనూ అందించేందుకు రాష్ట్రంలో ఉన్న 4 ఐటీడీఏల పరిధిలో హబ్స్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కేన్సర్ కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోనే తొలిసారిగా, ప్రభుత్వ హాస్పిటళ్లలో ఐవీఎఫ్ సేవలను తెలంగాణలో అందిస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలకు వైద్యపరంగా ఏది అవసరమో, ఆ సేవలను అందిస్తూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.






