- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ ఉగ్రవాదిపై సబర్మతి జైలులో దాడి
సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నఉగ్రవాద నిందితుడు సయ్యద్ అహ్మద్ మెహియుద్దీన్ అబ్దుల్ ఖాదర్ జిలానీపై ముగ్గురు ఖైదీలు దాడి చేశారు. జైలులో ఖైదీలు దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్న నీలేష్ శర్మ మరో ఇద్దరు నిందితులు కలిసి జిలానీపై

దిశ, వెబ్ డెస్క్: సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నఉగ్రవాద నిందితుడు సయ్యద్ అహ్మద్ మెహియుద్దీన్ అబ్దుల్ ఖాదర్ జిలానీపై ముగ్గురు ఖైదీలు దాడి చేశారు. జైలులో ఖైదీలు దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్న నీలేష్ శర్మ మరో ఇద్దరు నిందితులు కలిసి జిలానీపై దాడి చేయడంతో ముక్కు, కళ్లు ప్రాంతంలో గాయాలయ్యాయి. దేశభక్తిని చాటుకునేందుకే నిందితులు ఉగ్రవాది జిలానీపై దాడి చేశారని జైలు అధికారి వెల్లడించారు.
దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువురిని అదుపు చేశారు. ఈ క్రమంలో జైలులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం జిలానీకి జైలులోనే మెడికల్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు చెందిన జిలానీ చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నాడు. తరవాత దుబాయ్ లో ప్రాక్టీస్ చేశాడు. కానీ వైద్యం పై దృష్టి పెట్టకుండా ఉగ్రవాదంవైపు ఆకర్షితుడు అయ్యాడు. రెసిన్ అనే రసాయనం తయారు చేసి భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేశాడు. కానీ ఇంటిలిజెన్స్ అప్రమత్తం అవ్వడంతో కటకటాల పాలయ్యాడు.
Read More... Owaisi: ఇప్పుడెక్కడి నుంచి వచ్చారు?.. ఎర్రకోట బ్లాస్ట్ పై అమిత్ షాకు ఒవైసీ ప్రశ్న






