- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు గర్వకారణం.. జాతీయ స్థాయిలో సత్తా చాటిన హైదరాబాద్ అమ్మాయి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న సంస్కృతి కొండూరు జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతూ మరో ఘన విజయం సాధించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న సంస్కృతి కొండూరు జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతూ మరో ఘన విజయం సాధించింది. టీసీఎస్ ఐఓఎన్ ఇంటెలిజెమ్ 8వ ఎడిషన్ జాతీయ స్థాయి పోటీల్లో ‘క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్’ సీనియర్ విభాగంలో నేషనల్ విన్నర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2026 ఎడిషన్‌లో ‘యూనివర్సల్ వాల్యూస్’, ‘క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్’ విభాగాల్లో పాల్గొన్న సంస్కృతి సెమీఫైనల్స్ వరకు చేరి తన ప్రతిభను నిరూపించింది. ముఖ్యంగా క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ విభాగంలో దేశవ్యాప్తంగా టాప్-2లో నిలిచి, గ్రాండ్ ఫినాలేలో జాతీయ విజేతగా అవతరించడం విశేషం. వరుసగా నాలుగో ఏడాది గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించడం అరుదైన ఘనతగా నిలిచింది.
ఇంతకుముందు కూడా జాతీయ స్థాయి టైటిళ్లు సాధించిన సంస్కృతి, 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల 21వ శతాబ్ద నైపుణ్యాలను పరీక్షించే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో నిరంతరం సత్తా చాటుతూ ప్రత్యేక రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలో ఆమె సాధించిన విజయం హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.ఈ సందర్భంగా సంస్కృతి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల మధ్య పోటీ పడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ప్రతి ఏడాది గ్రాండ్ ఫినాలేకు చేరుకోవడం, మూడు సార్లు జాతీయ టైటిల్ సాధించడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొంది. ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, స్నేహితులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, టీసీఎస్ ఐఓఎన్ బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.






