- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : ఉగ్రదాడిలో హైదరాబాద్ IB ఆఫీసర్ మృతి
జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం(Pahalgoan)లో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే(Tourists) లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇప్పటి వరకు 30 మంది టూరిస్టులు మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం మృతుల్లో ఒకరిని తెలంగాణవాసి(Telanaganite)గా గుర్తించారు. హైదరాబాద్(Hyderabad) కు చెందిన మనీష్ రంజన్(Manish Ranjan) నేడు జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. మనీష్ రంజన్ నగరంలో ఇంటలిజెన్స్ బ్యూరో(IB) అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మృతి భార్య, ఇద్దరు పిల్లలు ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డట్టు అధికారులు పేర్కొన్నారు.






