Miss World Contest : మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-28 12:56:22  IST  )

తెలంగాణ(Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరం మరో అంతర్జాతీయ వేడుకలకు సిద్ధం అవుతోంది.

Miss World Contest : మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరం మరో అంతర్జాతీయ వేడుకలకు సిద్ధం అవుతోంది. 72వ మిస్ వరల్డ్-2025(Miss World 2025) పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ నగరం అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తోంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నగరంలో ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన అందమైన మహిళలు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ మే 6, 7 తేదీల్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కాగా మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను చాటేందుకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా(Christina Piskova)తో పాటు మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా(Nandini Gupta) ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

పోటీలు ప్రారంభం కావడా నికి కేవలం 8 రోజులే సమయం ఉండటంతో, ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నగరంలో అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను విజయవం తంగా నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోని అందమైన మహిళలందరూ ఒకే వేదికపై సందడి చేయనున్న ఈ పోటీలు హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. ఈ అద్భుతమైన వేడుక కోసం నగర ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

Next Story