- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరబాదీలకు గుడ్ న్యూస్.. ముసురుకు గుడ్ బై సూరీడు వస్తున్నాడు
by Ajay Maddhiboyina |
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత నాలుగు రోజుల నుండి గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత నాలుగు రోజుల నుండి గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రెండు రోజులుగా ముసురు పట్టుకుంది. దీంతో పగలు రాత్రి తేడా లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో సూర్యుడు కూడా కనిపించడం లేదు. కాగా రాత్రి నుండి వర్షానికి బ్రేక్ పడుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. అంతే కాకుండా రేపు సూరీడి దర్శనం ఉంటుందని, నగరంలో పొడివాతావరణం ఉంటుందని తెలిపాడు. నార్త్ తెలంగాణ మినహాయించి రాష్ట్రంలోని మిగితా అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందన్నారు. నార్త్ తెలంగాణలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Next Story






