- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FAKE POSTER : వాట్సాప్, ఫోన్ కాల్స్ కొత్త నియమాలు ఫేక్.. హైదరాబాద్ పోలీస్ హెచ్చరిక
రేపటి నుంచి వాట్సాప్, ఫోన్ కాల్స్ కొత్త నియమాలు అమలు పై సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం అవుతున్న ఒక పోస్టర్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ స్పష్టత ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రేపటి నుంచి వాట్సాప్, ఫోన్ కాల్స్ కొత్త నియమాలు అమలు పై సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం అవుతున్న ఒక పోస్టర్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ స్పష్టత ఇచ్చింది. ఆ పోస్టర్ తమ విభాగం జారీ చేసినది కాదని, దానిని ఫేక్ (నకిలీ) అని గుర్తించింది. సంబంధిత పోస్టర్లో తెలంగాణ పోలీస్ లోగో, సీపీ సజ్జనార్ ఫోటోలు వాడి ప్రజలకు సూచనలు చేస్తున్నట్లు చూపించారు. అయితే, హైదరాబాద్ సిటీ పోలీస్ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రచారం అవుతున్న ఈ పోస్టర్ పై స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్ పోలీస్ ఈ పోస్టర్‌ను ఖండిస్తూ.. ‘ఈ పోస్టర్‌ను పోలీసులు విడుదల చేయలేదు. ఇది పూర్తిగా నకిలీది. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పంచుకోకండి’ అని హెచ్చరించింది.
కాగా, రేపటి నుంచి కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడుతున్నాయని సీపీ సజ్జనార్ ఫోటో ఉపయోగించి తెలంగాణ పోలీస్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పేరుతో పోస్టర్ సమాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అన్ని కాల్స్ రికార్డు, సేవ్ చేయబడతాయని, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని షోషల్ మీడియాలు పర్యవేక్షించబడతాయని ప్రచారం జరుగుతోంది. అలాగే మీ ఫోన్ మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడుతుందని పోస్టర్లో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్టర్ వివిధ సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ట్వీట్ ఇదే..






