హైదరాబాద్ వాహనదారులకు షాక్..25.5 లక్షల చలాన్లు !

by velandi.Saikiran |

హైదరాబాద్ ( Hyderabad) వాహనదారులకు బిగ్ అలర్ట్. ట్రాఫిక్ రూల్స్ ( Traffic Rules) బ్రేక్ చేసినందుకుగాను హైదరాబాద్

హైదరాబాద్ వాహనదారులకు షాక్..25.5 లక్షల చలాన్లు !
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ( Hyderabad) వాహనదారులకు బిగ్ అలర్ట్. ట్రాఫిక్ రూల్స్ ( Traffic Rules) బ్రేక్ చేసినందుకుగాను హైదరాబాద్ వాహనదారులకు భారీగానే ట్రాఫిక్ పోలీసులు ( Traffic Police) ఫైన్స్ ( Fines) వేస్తున్నారు. 2023 తో పోల్చితే... 2024 సంవత్సరంలో... ట్రాఫిక్ చలాన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దింతో వాహనదారులపై కూడా భారీగానే భారం పడనుంది.

2024 సంవత్సరం మొత్తంలో హెల్మెట్ ( Helmet ) లేకుండా.. నడిపినందుకు 25.5 లక్షల చలాన్లు విధించారు పోలీసులు. ఈ మేరకు ఆర్టిఐ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అటు మొబైల్ ఫోన్ వాడుతూ... వాహనాలు నడిపిన వాళ్లపై ఫైన్స్ పడ్డాయి. అలా 2024 సంవత్సరంలో 86,048 చలాన్లు విధించారు. అయితే ఆర్టిఐ లెక్కల ప్రకారం 2023 సంవత్సరంలో.. కంటే 2024 సంవత్సరంలోనే భారీగా ఫైన్లు పడ్డాయి.

2024లో... హైదరాబాద్ వాహనదారులు విపరీతంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. 2023 సంవత్సరంలో 19.1 లక్షల ఫైన్ లు మాత్రమే పడ్డాయి. కానీ 2024 లో మాత్రం ఆ సంఖ్య భారీగానే పెరిగింది. అటు మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడిపినందుకుగాను 57,866 చలాన్లు వేశారు పోలీసులు. అలాగే సీట్ బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసిన కేసులు 22,300గా నమోదు అయ్యాయి. రోడ్లపై రేసింగ్ చేసిన కేసులు 30 గా నమోదు అయ్యాయి.

Next Story