- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సీపీ సజ్జనార్ భేటీ
దేశంలో పెరుగుతున్న ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో పెరుగుతున్న ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో భేటీ అయ్యారు. సైబర్ నేరగాళ్లకు ఆక్సిజన్‌లా మారిన ‘మ్యూల్ ఖాతాల’ నియంత్రణలో ఆర్బీఐ మరింత కఠినంగా వ్యవహరించాలని సీపీ సజ్జనార్ కోరారు. మ్యూల్ ఖాతాల గుర్తింపునకు ప్రత్యేకంగా ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే ఖాతాలు తెరిచే సమయంలో బ్యాంకు సిబ్బంది పాటించాల్సిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని తెలిపారు.
ముఖ్యంగా ఖాతాదారుడు భౌతికంగా ఉన్నాడా లేదా అనే అంశాన్ని నిర్ధారించేందుకు జియో వెరిఫికేషన్, లైవ్ వీడియో కేవైసీలను తప్పనిసరి చేయాలని సీపీ సూచించారు. ఈ చర్యల ద్వారా మ్యూల్ ఖాతాల పెరుగుదలకు గణనీయంగా అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాల నివారణకు పోలీస్ వ్యవస్థతో పాటు బ్యాంకింగ్ రంగం సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆర్బీఐ కీలక పాత్ర పోషించాలని సీపీ సజ్జనార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.






