Hyderabad metro: రేపు ఆ సమయంలో నిలిచిపోనున్న మెట్రో రైళ్లు

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-08-15 12:31:34  IST  )

Hyderabad metro trains will stop for 1 minute on august 16| 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక ట్రాఫిక్‌ నిలిపివేత, సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా

Hyderabad metro trains will stop for 1 minute on august 16
X

దిశ, డైనమిక్ బ్యూరో : Hyderabad metro trains will stop for 1 minute on august 16| 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక ట్రాఫిక్‌ నిలిపివేత, సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ మెట్రో రైళ్లను ఒక నిమిషం పాటు ఎక్కడికక్కడ నిలిపివేసి, జాతీయ గీతం ఆలపించాలని నిర్ణయం తీసుకుంది. రైళ్లలో మరియు మెట్రో స్టేషన్లలో గీతాలాపణ చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం కోరారు. మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రయాణికులు లేచి నిలబడి పాల్గొనాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి: రాజకీయ సన్యాసం తీసుకుంటా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Next Story