Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పెంచిన చార్జీల సవరణ

by Prasad Jukanti |   (  Updated:2025-05-20 08:47:00  IST  )

పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పెంచిన చార్జీల సవరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన చార్జీలను రూ.10 శాతం తగ్గించింది. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని చార్జీల జోన్ లలో కొత్తగా సవరించిన చార్జీలపై ఈ తగ్గింపు ప్రకటించింది. తగ్గించిన చార్జీలు మే 24 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఎఫ్ఎఫ్ సీ సిఫార్సుల ఆధారంగా చార్జీల సవరణ జరిగిందని పేర్కొంది. ఈ పరిణామంపై ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ఎల్ అండ్ టీ మెట్రో రైలు బాధ్యతాయుతమైన పట్టణ రవాణా ఆపరేటర్ గా హైదరాబాద్ ప్రజలకు సమర్థవంతమైన సరసరమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. మెట్రో కార్యకలాపాలు స్థిరంగా కొనసాగేందుకు చార్జీల సవరణ అనివార్యం అయిందని అయినప్పటికీ ప్రయాణికులపై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని మేము అర్థం చేసుకుని చార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఇటీవలే మెట్రో యాజమాన్యం చార్జీలను పెంచింది. కనీస చార్జీ రూ.10 నుంచి రూ. 12 కు గరిష్ట చార్జీ రూ. 60 నుంచి 75 కు పెంచింది. చార్జీల పెంపుపై ప్రయాణికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఈ నేపథ్యంలో తాజాగా పెంచిన చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Next Story