- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు అంతరాయం !
హైదరాబాద్ ( Hyderabad) ప్రయాణికులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ( Hyderabad) ప్రయాణికులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో నాంపల్లిలో ( Nampally ) మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు హైదరాబాద్ మెట్రో సేవలకు ( Hyderabad Metro Rail services ) తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో... ప్రయాణికులు ( Passengers ) తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సాయంత్రం సమయంలో మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం చోటు చేసుకున్న నేపథ్యంలో.. అప్పుడే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. 15 నిమిషాల తర్వాత మళ్లీ యథావిధిగా మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. మెట్రో సేవలకు ( Metro Rail services ) అంతరాయం కలిగిన నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన అధికారులు... సమస్యను పరిష్కరించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది ఇలా ఉండగా... ఇటీవల ప్రయాణికులకు మెట్రో ( Hyderabad Metro Rail ) శుభవార్త చెప్పింది. మెట్రో టైమింగ్స్ ( Hyderabad Metro Rail Timings ) పెంచుతున్నట్లు తాజాగా వెల్లడించింది. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో... ఇక మీదట సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆయా టెర్మినల్ స్టేషన్స్ నుంచి... ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి మెట్రో రైళ్లు. అదే సమయంలో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు కొనసాగుతాయి.






