హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్.. రూ.19 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్‌లు సిద్ధం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-14 05:06:59  IST  )

హైదరాబాద్‌ మెట్రో రైలు (HMR) సెకండ్ ఫేజ్‌ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్.. రూ.19 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్‌లు సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మెట్రో రైలు (HMR) సెకండ్ ఫేజ్‌ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అయితే ఆ పనులకు గాను రూ.19 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచానా వేశారు. మొత్తం మూడు మార్గాల్లో 86.5 కి.మీ.మేర ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదించారు. JBS-శామీర్‌పేట, JBS-మేడ్చల్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు - Future City రూట్లను అందులో చేర్చారు. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్‌కు సంబంధించి డీపీఆర్‌ (DPR)‌కు సీఎస్ రామకృష్ణా రావు నేతృత్వంలోని హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు మెట్రో లిమిటెడ్‌ (HAML) బోర్డు కూడా ఆమోదం తెలపడంతో తాజాగా ఆ నివేదిక తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపి నివేదికను కేంద్రానికి పంపనున్నారు.

మొత్తం మూడు మార్గాలు.. మొత్తం 86.5 కి.మీ‌.

మొదటగా జేబీఎస్‌ (JBS) నుంచి కార్ఖానా, హకీంపేట, అల్వాల్, తూంకుంట, శామీర్‌పేట వరకు 22 కి.మీ. మెట్రో ప్రతిపాదించారు. హకీంపేట (Hakimpet) ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ రన్‌వే రోడ్డు పక్కనే ఉండటంతో దాదాపు అక్క 1.5 కి.మీ మేర అండర్ గ్రౌండ్ మెట్రోను నిర్మించనున్నారు. అదేవిధంగా జేబీఎస్‌ నుంచి తాడ్‌బండ్, సుచిత్ర, బోయిన్‌పల్లి, కొంపల్లి మీదుగా మేడ్చల్‌కు 24.5 కి.మీ. మేర మెట్రోని ప్రతిపాదించారు. మొత్తం మూడు మార్గాల కూడలిగా జేబీఎస్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎలైన్‌మెంట్‌ను ఫిక్స్ చేశారు. శంషాబాద్‌ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport) నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 40 కి.మీ.మెట్రోను ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్టులో టర్మినల్‌ స్టేషన్‌‌ను అండర్‌గ్రౌండ్‌లో నిర్మించనున్నారు. అక్కడి నుంచి రావిర్యాల ORR వరకు ఎలివేటెడ్‌లో మెట్రోతో ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి మధ్యలోంచి భూ మార్గంలో 18 కి.మీ. వెళ్లేలా డీపీఆర్‌ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బ్యాంకుల రుణాలు, పీపీపీ విధానంలో నిధులను సేకరించనున్నారు.

Next Story