తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ప్రభుత్వం అప్రమత్తం

by Sathputhe Rajesh |   (  Updated:2022-03-31 06:09:17  IST  )

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. గత వారంరోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ప్రభుత్వం అప్రమత్తం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. గత వారంరోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి. ఎండతో పాటు వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.ఇందులో భాగంగా హైదరాబాద్ వాతావరణశాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల్లో ఎండలు తీవ్రస్థాయిలో ఉండే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పగటి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని, వడగాలులు మరింత పెరుగుతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయట తిరగవద్దంటూ వాతావరణశాఖ హెచ్చరించింది. రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణలోకి పొడిగాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని స్పష్టం చేసింది. వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించాలని తెలిపారు.


Next Story