రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

by Malleboina Mahesh |   (  Updated:2024-04-22 03:52:27  IST  )

నెల రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు కొద్ది రోజులుగా కాస్త ఉపశమనం కలుగుతుంది. రాష్ట్రంలోని పలు చోట్ల శనివారం, ఆదివారం వర్షాలు కురిశాయి.

రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: నెల రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు కొద్ది రోజులుగా కాస్త ఉపశమనం కలుగుతుంది. రాష్ట్రంలోని పలు చోట్ల శనివారం, ఆదివారం వర్షాలు కురిశాయి. అలాగే మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ రోజు హన్మకొండ, హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో విస్తాయని.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Next Story