Hyderabad: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-26 04:22:19  IST  )

పరిపాలనా సౌలభ్యం కోసం ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ భారీ సంఖ్యలో ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు మొత్తం 45 మంది అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో రాష్ట్ర సచివాలయంలోని కీలక శాఖల నుంచి జిల్లాల కలెక్టర్ల వరకు అనేక మార్పులు జరిగాయి. ఇందులో ఐఏఎస్ సంజయ్ కుమార్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (PR & RD) శాఖకు బదిలీ అయ్యారు. ఐఏఎస్ ఎన్.శ్రీధర్ పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఐటీ (ITE &C), పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అదేవిధంగా ఆయన మైన్స్, జియాలజీ శాఖ బాధ్యతల్లో కూడా కొనసాగుతారు. రాహుల్ బొజ్జ ఇరిగేషన్ శాఖ నుంచి సాధారణ పరిపాలన (రాజకీయ) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఈయనకు బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి ఆర్థిక, ప్రణాళిక శాఖ సెక్రటరీగా ఉన్న గౌరవ్ ఉప్పల్‌ TGMSIDC ఎండీగా నియమితులయ్యారు. ముషారఫ్ అలీ ఫారూఖీ TGSPDCL సీఎండీ నుంచి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 3వ డిస్కమ్ సీఎండీగా బదిలీ అయ్యారు. జితేష్ వి.పాటిల్ TGSPDCL కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇతర కీలక పోస్టింగ్‌లు ఇలా..

మహబూబ్‌నగర్ కలెక్టర్ ఉన్న బి.విజియేంద్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శిగా, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా నియమితులయ్యారు. దివ్య దేవరాజన్ సెర్ప్ (SERP) సీఈవోగా కొనసాగుతూనే ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు (FAC) చేపట్టనున్నారు. మహబూబాబాద్ కలెక్టర్‌గా ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమన్వయ శాఖ (GoI ప్రాజెక్ట్స్, CSS) ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా ఉన్న ఎం.హనుమంతరావు నుంచి దేవాదాయ శాఖ (Endowments) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయనకు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. నారాయణపేట కలెక్టర్‌గా ఉన్న సిక్త పట్నాయక్ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న సందీప్ కుమార్ ఝా జనగాం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ కలెక్టర్‌గా పామెలా సత్పతి కార్మిక శాఖ (Labour) స్పెషల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మెదక్ కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్ సహకార శాఖ స్పెషల్ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఐటీ (ITE&C) శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న భవేష్ మిశ్రా నుండి అదే శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేట్ అయ్యారు.

జిల్లాలకు కొత్తగా వెళ్లే కలెక్టర్లు వీరే..

జనగాం కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. జోగులాంబ గద్వాల్ కలెక్టర్ సంతోష్ బీఎం గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. వికారాబాద్ కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ నారాయణపేట్ కలెక్టర్‌గా నియామితులయ్యారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ కలెక్టర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కాత్యాయని దేవి వెళ్లనున్నారు. టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా ఫణీంద్రా రెడ్డి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఎటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్న చైత్ర మిశ్రా నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. ఇక గరీమా అగర్వాల్‌ను రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు. వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి, మెదక్ కలెక్టర్‌ ప్రతిమా సింగ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా కష్బూ గుప్తా, హనుమకొండ కలెక్టర్‌గా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా కె.విద్యా సాగర్, ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం ఎం.సురేందర్‌కు బాధ్యతలు కట్టబెట్టారు.

జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా మందా మకరందు, మెడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్, వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉమశంకర్ ప్రసాద్, నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ లాల్, మంచిర్యాల అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, వరంగల్ అదనపు కలెక్టర్‌గా వైవీ గణేశ్, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా అబ్దుల్ హమీద్, నిర్మల్ అదనపు కలెక్టర్‌గా బి.వెంకటేశ్వర్లు, వనపర్తి అదనపు కలెక్టర్‌గా కీమ్యా నాయక్ నియమితులయ్యారు.



Next Story