హైదరాబాద్ స్థానిక సంస్థల MLC.. ఏ పార్టీ బలం ఎంతంటే?

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Hyderabad Local Body MLC) ఎన్నికకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ స్థానిక సంస్థల MLC.. ఏ పార్టీ బలం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Hyderabad Local Body MLC) ఎన్నికకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కాగా, ఏప్రిల్ 4వ తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 25వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌ పదవీ కాలం ఈ ఏడాది మే 1వ తేదీకి ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ(Election Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు.. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కోడ్‌(Election Code) అమలులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Hyderabad Local Body MLC) ఎన్నికలు దాదాపు ఏకపక్షంగానే జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరి బలం ఎంతో ఓసారి తెలుసుకుందాం.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం ఓట్లు 110 ఉన్నాయి. అందులో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫీషియో సభ్యులు.. ఉండగా.. ప్రస్తుతం 3 డివిజన్లకు కార్పొరేటర్లు లేరు.

ఇందులో ఎంఐఎం పార్టీకి 49 ఓట్ల బలం ఉంది. అందులో ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు 40 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. ఇక బీఆర్ఎస్‌కు 25 ఓట్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మె ల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి 19 మంది మద్దతుంది. వీరికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్‌కు కేవలం 14 ఓట్లే ఉన్నాయి. ఇందులో ఒక రాజ్యసభ ఎంపీ, నలుగురు ఎమ్మె ల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు.

ప్రస్తుతం 49 ఓట్లతో ఎంఐఎం పార్టీ బలంగా ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే.. విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Next Story