- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad: గోల్కొండలో చిరుత కలకలం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యహ్నం గోల్కొండ(Golconda) కోట ప్రాంతంలో చిరుత(Leopard) సంచారం కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో సంచరించడాన్ని పలువురు స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడినుంచి పరార్ అయ్యారు. ప్రస్తుతం చిరుత కోసం ఫారెస్ట్ అధికారులతో కలిసి పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. కాగా, ఇటీవలే నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్ క్యాంపస్‌లో చిరుత సంచారం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ చిరుత జాడను కనిపెట్టారు. ఇది మరువకముందే గోల్కొండ వద్ద చిరుత సంచరించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






