- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో గ్యాస్ కష్టాలు.. మెనూలో కోత పెట్టిన హాస్టల్స్
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతులపై పడింది. దీంతో ఆసియా దేశాల్లో ఇంధన కష్టాలు మొదలయ్యాయి. భారత్ లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు కొద్దిరోజుల వరకూ ఎలాంటి ఇబ్బంది లేదని, వాహనదారులు టెన్షన్ పడొద్దని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. హమ్మయ్యా అనుకునేలోపే.. ఆ పిడుగు వచ్చి గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడింది. చమురు దిగుమతులు తగ్గడంతో గ్యాస్ సరఫరా పై ఎఫెక్ట్ పడింది. దీంతో కమర్షియల్ సిలిండర్లకంటే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ఉన్న హాస్టల్ యాజమాన్యాలు మెనూలో కోత విధించాయి.
నగరంలో సుమారుగా 11000 హాస్టళ్లు ఉండగా.. 10 లక్షల మంది వాటిలో ఉంటున్నట్లు సమాచారం. హాస్టల్స్ లో వాడేది కమర్షియల్ సిలిండర్లే. ఇప్పుడు వాటి కమర్షియల్ సిలిండర్లు దొరకడం కష్టం కావడంతో మెనూలో వంటలను తగ్గిస్తున్నట్లు ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, దీనివల్ల మెనూను తగ్గిస్తున్నట్లు తెలిపింది. కాఫీ, టీ, దోస, పూరీ, బజ్జీ, చపాతీలు అందించడం కుదరదని స్పష్టం చేసింది. ఆయిల్ ఎక్కువగా వాడే వంటకాలను అందించలేమంది. అలాగే self cooking ఆప్షన్ ను కూడా తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు చెప్పింది. ఎక్కువసేపు వండాల్సి ఉన్న కూరలను కూడా మెనూలో అందించలేమని పేర్కొంది. పప్పు, రసం, అన్నం, సాంబారు వంటి వాటిని రెగ్యులర్ గా అందించగలమని వివరించింది. గ్యాస్ షార్టేజ్ తగ్గేంతవరకూ వీటిని ఫాలో అవ్వాల్సిందిగా ఐటీ కారిడార్ హాస్టళ్లకు సూచించింది. ఈ మేరకు హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులు సహకరించాల్సిందిగా కోరింది. మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, దుర్గంచెరువు, నానక్ రామ్ గూడ ఐటీకారిడార్ సెక్టార్ లోకి వస్తాయి.






