వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. జన సైనికులకు పవన్ కీలక పిలుపు

by Kema Shiva Kumar |

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరం తడిసిముద్దైంది.

వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. జన సైనికులకు పవన్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరం తడిసిముద్దైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాల నుంచి వరద నీరు విడుదల చేయడవంతో మూసీ (Musi) ఉగ్రరూపం దాల్చింది. ఈ పరిణామంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వదర నీరు వచ్చి చేరింది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు, తెలంగాణ జనసేన పార్టీ (Janasena Party) ముఖ్య నాయకులు, శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు. వరద బాధితులకు మనోధైర్యం కల్పించి వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని, మూసీ వరదతో MGBS పరిసరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story