Bhatti Vikramarka : బిల్డర్స్ కు హైదరాబాద్ స్వర్గధామం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Y. Venkata Narasimha Reddy |
Bhatti Vikramarka : బిల్డర్స్ కు హైదరాబాద్ స్వర్గధామం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : బిల్డర్స్ కు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నోవాటెల్ ల జరిగిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్(Green Telangana Summit 2025) సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం(Full support to builders)ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అభివృద్ధి దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి 10వేల కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మా ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా ఎంవోయూ ఈ రోజు చేసుకున్నామని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది తొలి నెట్ జీరో సిటీ కాబోతుందని తెలిపారు. సబ్సీడీలు ఇస్తే రియల్ ఎస్టెట్ రంగం మరింత విస్తరించేదంటున్నారని...అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. బిల్డర్స్ కు కావాలసిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రీన్ ఎనర్జీ దిశగా హైదరాబాద్ నగరాన్ని తీర్చి దిద్దేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ విధానం తెచ్చామని..రెవెన్యూ తగ్గినా వాటికి రాయితీలు ఇస్తున్నామన్నారు. డిజిల్ వాహనాలను క్రమంగా ఈవీలుగా మార్చే ప్రక్రియను ప్రోత్సహిస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని మైలురాయిగా చేపట్టామని..ఎంత ఖర్చయినా దీన్ని అమలు చేసి తీరుతామన్నారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను మా ప్రభుత్వం అమలు చేస్తున్న క్రమంలో దావోస్ నుంచి 1లక్ష 80వే కోట్ల పెట్టుబడులు వచ్చాయని..మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు.

2030కల్లా 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకున్నామని..2035కల్లా 40వేల మెగావాట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధికి రోడ్లు, లింక్, ఎలివేషన్ రోడ్లు, ఫ్లైవోర్లు, మెట్రోల విస్తరణ చేపట్టనున్నామని..పరిపాలన సంస్కరణలు కూడా జోడించి తెలంగాణ రైజింగ్ దిశగా నగరాన్ని ముందుకు తీసుకెలుతామన్నారు.

Advertisement
Next Story