- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతరిక్ష రంగానికి హైదరాబాద్ అడ్డా : భట్టి విక్రమార్క
సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగాలకు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Mallu Bhatti vikramarka) పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగాలకు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Mallu Bhatti vikramarka) పేర్కొన్నారు. బుధవారం రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన జియో ప్యాక్(గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వెస్ట్)(GEOPAQ) ఆధ్వర్యంలో బయో ఇన్‌స్పైర్డ్ ఫ్రాంటియర్స్-2025 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయై, ప్రసంగించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన పరిశోధన సంస్థలు, పరిశ్రమలు హైదరాబాద్‌లో బీజం వేశారని అన్నారు.
అప్పటి నుంచి బీడీఎల్, డీఆర్‌డీవో, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లాంటి ప్రముఖ సంస్థలు ఆయా రంగాలను మరింత అభివృద్ధి చేస్తూ వస్తున్నాయని అన్నారు. నగరంలో ఐఐటి, ట్రిపుల్ ఐటీ, హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు శాస్త్ర సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళుతున్నాయని కొనియాడారు. ఫార్మా, ఐటీ, రక్షణ వంటి అనేక రకాల క్లస్టర్స్‌లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని... అంతరిక్షరంగంలోనూ క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం స్పేస్ టెక్నాలజీలో ఆవిష్కరణలు, పెట్టుబడులను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జియో ప్యాక్ సీఈఓ, వ్యవస్థాపకుడు ముర్తజ కురసానితోసహా తదితరులు పాల్గొన్నారు.






