- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ సమిట్‌కు ముస్తాబైన హైదరాబాద్.. త్రీడీ ప్రొజెక్టర్.. ప్రత్యేక ఆకర్షణగా సచివాలయం (వీడియో)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా (Telangana Rising Global Summit) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు, ఎల్లుండి ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ సమిట్‌కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ నగరం ముస్తాబైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమిట్ వేదిక.. ఇలా అన్ని చోట్లా హైటెక్ హంగులతో, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ఓ పండగ వాతావరణం సృష్టించారు.
చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం వద్ద త్రీడీ ప్రొజెక్టర్ మ్యాపింగ్ (projector mapping) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ప్రదర్శించడానికి రూపొందించారు. వీడియో ఇదే..






