హిట్ మ్యాన్‌కు హైదరాబాద్ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్

by Disha Web Desk 2 |
హిట్ మ్యాన్‌కు హైదరాబాద్ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓటమి తప్పదని ఆశలు వదులుకున్న మ్యాచ్‌లను రోహిత్ శర్మ అనేకం గెలిపించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా.. ఆదివారం(ఏప్రిల్ 30) రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన అద్భుతంగా ఆడిన ఇన్సింగ్స్‌ను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకు భారీగా శుభకాంక్షలు తెలిపారు. అంతేగాక, రోహిత్‌ పుట్టిన రోజును హైదరాబాద్‌లో అభిమానులు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సుదర్శన్ థియేటర్ వద్ద ఏకంగా 60 అడుగుల రోహిత్‌ శర్మ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్‌కు కూడా ఇంత పెద్ద కటౌట్‌ పెట్టిన దాఖలాలు లేవని చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో హిట్ మ్యాన్ ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.






Next Story

Most Viewed