వెంటనే బదిలీలు చేపట్టండి.. ప్రభుత్వాన్ని కోరిన ఇంజినీర్స్ అసోసియేషన్

by Gantepaka Srikanth |

నీటిపారుదల శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ల (ఏఈఈ) బదిలీలు వెంటనే చేపట్టాలని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

వెంటనే బదిలీలు చేపట్టండి.. ప్రభుత్వాన్ని కోరిన ఇంజినీర్స్ అసోసియేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీటిపారుదల శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ల (ఏఈఈ) బదిలీలు వెంటనే చేపట్టాలని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మల్టీజోన్-II నుండి మల్టీజోన్-1కి జరుగుతున్న ఈ బదిలీల్లో మల్టీజోన్-2 స్థానికులకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తే వారికి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న ఏఈఈలకు కూడా ఈ బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని అసోసియేషన్ కోరింది. ఒకవేళ బదిలీలు తప్పనిసరి అయితే, మల్టీజోన్-1 నుండి మల్టీజోన్-2కి వచ్చిన, మల్టీజోన్-1 స్థానికులైన వారిని తిరిగి పంపాలని విజ్ఞప్తి చేసింది.

Next Story