- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలోనే 55 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరస్తుల ఆట కట్టించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరస్తుల ఆట కట్టించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 55 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రెస్ నోటీ రిలీజ్ చేశారు. 196 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. సైబర్ నేరస్తుల మాయలో పడి సొమ్ము పోగొట్టుకున్న బాధితులకు రూ.62.34 లక్షలను తిరిగి అప్పగించారు. అలాగే.. నేరస్తులకు చెందిన 61 బ్యాంక్ అకౌంట్లలో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అరెస్టైన సైబర్ నేరస్తులపై దేశవ్యాప్తంగా 136 కేసులున్నట్లు తెలిపారు. వీటిలో 45 కేసులు తెలంగాణలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఏపీలో ఫేక్ ట్రేడింగ్ యాప్ తో రూ.24.17 లక్షలు దోచుకున్న వ్యక్తితో పాటు.. హైదరాబాద్ లో 62 ఏళ్ల వృద్ధుడి వద్ద నుంచి రూ.1.07 కోట్లు దోచుకున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి తన మొబైల్ ను పోగొట్టుకోగా ఆ మొబైల్ నుంచీ రూ.1.95 లక్షలను కాజేసిన నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. అలాగే ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్ ద్వారా 33 సైబర్ మోసాలు జరిగినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 31 మొబైల్స్, 14 చెక్ బుక్స్, 9 డెబిట్ కార్డులు, 2 ల్యాప్ టాప్స్, 3 షెల్ కంపెనీ స్టాంప్స్, 2 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ అధికారుల పేరుతో ఉన్న ప్రొఫైల్స్ నుంచి వచ్చే మెసేజులను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అలాగే తెలియని సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపుల్లో చేరవద్దని, ఏపీకే ఫైల్స్, ఫిషింగ్ లింక్స్ వంటి వాటిని ఓపెన్ చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. CBI, RBI, ED, కస్టమ్స్, న్యాయవ్యవస్థ, సైబర్ క్రైమ్ పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో, FedEx, BSNL, TRAI లేదా ఇలాంటి ఏజెన్సీల నుండి వస్తున్నట్లు చెప్పుకునే బెదిరింపు వీడియో కాల్స్ లేదా సందేశాలు వచ్చినప్పుడు ప్రజలు భయపడవద్దని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్ లు వచ్చినపుడు 1930 హెల్ప్ లైన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.






