ట్రాన్స్‌జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక

by velandi.Saikiran |

ట్రాన్స్ జెండ‌ర్ల మ‌ధ్య గ్రూప్ త‌గాదాలు, ఆధిప‌త్య పోరు త‌ర‌చూ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌కు, ప్రాణ న‌ష్టానికి కార‌ణం అ

ట్రాన్స్‌జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్‌: హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరో కీలక ప్రకటన చేశారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవంటూ ట్రాన్స్ జెండర్లకు హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. సమాజంలో గౌరవ ప్రదంగా జీవించాలని వాళ్లకు హితువు పలికారు. కాదని దౌర్జన్యం చేస్తే, చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్ అమీర్ పేట‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియల్ లో 250 మంది ట్రాన్స్ జెండ‌ర్ల‌తో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ల గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడారు.

ట్రాన్స్ జెండ‌ర్ల మ‌ధ్య గ్రూప్ త‌గాదాలు, ఆధిప‌త్య పోరు త‌ర‌చూ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌కు, ప్రాణ న‌ష్టానికి కార‌ణం అవుతున్నాయ‌ని వివ‌రించారు. ఈ మధ్యకాలంలో ట్రాన్స్ జెండర్ల‌పై ప్రజల నుంచి అనేక రకాల కంప్లైంట్లు వస్తున్నాయని తెలిపారు. శుభ కార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదని సూచ‌న‌లు చేశారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించబోమ‌ని వార్నింగ్ ఇచ్చారు స‌జ్జ‌నార్. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తా హెచ్చ‌రించారు. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.

Next Story