లైసెన్స్‌లు రద్దు చేస్తాం.. ఆహార పదార్థాల కల్తీపై సీపీ సజ్జనార్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

ఆహార ప‌దార్థాల క‌ల్తీపై హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సీరియ‌స్ అయ్యారు. ఫుడ్ క‌ల్తీకి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. క‌ల్తీని నిరోధించడానికి పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారుల‌తో ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎస్వోపీ అమ‌లు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

లైసెన్స్‌లు రద్దు చేస్తాం.. ఆహార పదార్థాల కల్తీపై సీపీ సజ్జనార్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆహార ప‌దార్థాల క‌ల్తీపై హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సీరియ‌స్ అయ్యారు. ఫుడ్ క‌ల్తీకి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. క‌ల్తీని నిరోధించడానికి పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారుల‌తో ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎస్వోపీ అమ‌లు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ప‌దే ప‌దే క‌ల్తీల‌కు పాల్ప‌డితే లైసెన్సులు సైతం ర‌ద్దు చేస్తామని చెప్పారు. అవ‌స‌ర‌మైతే పీడి యాక్ట్ కూడా ప్రయోగిస్తామ‌ని క‌ల్తీ రాయుళ్ల‌ను హెచ్చ‌రించారు. ఇదిలా ఉంటే రోజురోజుకు ఆహార ప‌దార్థాల క‌ల్తీ పెరుగుతోంది.

ప్ర‌తి ఆహార ప‌దార్థాన్ని క‌ల్తీ చేస్తూ మార్కెట్ లో య‌థేచ్చ‌గా అమ్మేస్తున్నారు. చిన్నారులు తాగే పాల‌ను సైతం క‌ల్తీ చేస్తున్న ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. పాల‌లో యూరియా లాంటి ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు క‌లిపి క‌ల్తీ చేయ‌డం ఆందోళ‌న క‌లిస్తోంది. మ‌రోవైపు అల్లంలో అరటితో తొక్క‌తో పాటు ఇత‌ర ర‌సాయ‌నాలు, మ‌సాలాల్లో చెక్క‌పొట్టు, కారంపొడిలో ఇటుక‌పొడి ఇత‌ర ర‌సాయ‌నాలు క‌లిపి క‌ల్తీ చేస్తున్న ఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి. జంతువుల క‌లేభ‌రాళతో వంట నూనెలు త‌యారు చేస్తున్న ఘ‌ట‌న‌లు సైతం హైద‌రాబాద్ లో చోటు చేసుకున్నాయి.

Next Story