Sajjanar: క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక రిక్వెస్ట్

by Ramesh Naini |   (  Updated:2026-01-09 10:32:31  IST  )

పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.

Sajjanar: క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి సంబరం విషాదం కాకూడదని, పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారిందన్నారు. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం.. అని సజ్జనార్ తెలిపారు. పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దని, తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండన్నారు. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించాలని సూచించారు. మీ రాక కోసం మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.. వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు.. అని ప్రజలకు రిక్వెస్ట్ చేశారు.

తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి..

పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే.. ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయాలని సజ్జనార్ సూచించారు. ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం (Safe Distance) పాటించాలని అన్నారు. రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దు.. గుర్తుంచుకోండి.. ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story