- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి కాదు: సీపీ సజ్జనార్
హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి వస్తే పిల్లలు పెద్దలు పతంగ్ లు ఎగరవేస్తారని అన్నారు. ఈ పండుగను చాలా ఎంజాయ్ చేస్తారని వ్యాఖ్యానించారు. కానీ చైనా మాంజా వాడకం పండుగలో విషాదాన్ని మిగిలుస్తుందని హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్: చైనా మాంజాను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. హైదరాబాద్ లో వరుస దాడులు చేస్తూ చైనా మాంజా విక్రయాలపై పంజా వేస్తున్నారు. అయినప్పటికీ అక్రమంగా కొంతమంది మాంజాను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి వస్తే పిల్లలు పెద్దలు పతంగ్ లు ఎగరవేస్తారని అన్నారు. ఈ పండుగను చాలా ఎంజాయ్ చేస్తారని వ్యాఖ్యానించారు. కానీ చైనా మాంజా వాడకం పండుగలో విషాదాన్ని మిగిలుస్తుందని హెచ్చరించారు.
చైనా మాంజాను గాజులు, నైలాన్, సింథిటిక్ దారంతో తయారు చేస్తారని చెప్పారు. కాబట్టి కరెంట్ తీగలకు తాకినా షాక్ కొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని వల్ల వచ్చే ఆనందం కంటే విషాదమే ఎక్కువ అన్నారు. పిల్లలు చైనా వాడకుండా పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలంతా నూలు దారాన్ని వాడాలని సూచించారు. గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదని అన్నారు. చైనీస్ మాంజా దారం తెగదు కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు కోస్తుందని అన్నారు. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదన్నారు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండగని పండగలా జరుపుకోవాలని.. ప్రాణాలు తీసి కాదన్నారు.






