‘సూపర్ బౌలింగ్ DSP సిరాజ్’.. హైదరాబాద్ CP ఆనంద్ ప్రశంస

by Gantepaka Srikanth |

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బౌలర్ సిరాజ్(Mohammed Siraj) అదరగొట్టారు.

‘సూపర్ బౌలింగ్ DSP సిరాజ్’.. హైదరాబాద్ CP ఆనంద్ ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బౌలర్ సిరాజ్(Mohammed Siraj) అదరగొట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టారు. బూమ్రా లేకపోవడంతో ఆ బాధ్యతను తన మీద వేసుకొని జట్టును ఆదుకున్న సిరాజ్‌ను అంతా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌(Hyderabad CP Anand) కూడా సిరాజ్‌ను ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలంగాణ పోలీస్(Telangana Police), డీఎస్పీ సిరాజ్ ప్రదర్శన చాలా ఆకట్టుకున్నది. ఇక ముందు కూడా ఇలాగే జట్టుకు మరిన్ని విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాలి. శుభాకాంక్షలు’ అని ఎక్స్ వేదికగా సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 77/3తో బ్యాటింగ్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ 407 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులో వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌ (184), హ్యారీ బ్రూక్‌ (158) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్‌(6/70), ఆకాశ్‌ దీప్‌ (4/88) అదరగొట్టారు. వీరిదెబ్బకు ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో ఆరుగురు డకౌట్‌ అయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ నష్టపోయి 64 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (28*), కరుణ్‌ నాయర్‌ (7) ఉన్నారు. యశస్వి జైస్వాల్‌ (28) పరుగులు చేశాడు. 51 పరుగుల వద్ద జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్‌ 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Next Story