HYD : ప్రేమ పేరిట రీల్స్ పిచ్చి.. రోడ్డుపై అసభ్య ప్రవర్తన వైరల్

by Bhanu |   (  Updated:2025-07-14 04:40:21  IST  )

ప్రేమ పేరిట మ‌ర్యాద‌లు మ‌రచిపోతోంది యువత. తాజా ఉదాహరణగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది.

HYD : ప్రేమ పేరిట రీల్స్ పిచ్చి.. రోడ్డుపై అసభ్య ప్రవర్తన వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమ పేరిట మ‌ర్యాద‌లు మ‌రచిపోతోంది యువత. తాజా ఉదాహరణగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది. ఓ ప్రేమ జంట రీల్స్ కోసం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పరిగణలోకి తీసుకోకుండానే బైక్‌పై ప్రమాదకరంగా ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన అఫ్జల్‌గంజ్ ప్రాంతంలోని ఆరంఘర్ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. ఓ యువకుడు బైక్‌ను నడుపుతూ, తన ప్రియురాలిని ముందు ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని, ఇద్దరూ అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియో తీసుకున్నారు. వారిద్దరూ స్పష్టంగా కెమెరాలో చిక్కారు. ఈ దృశ్యం చూడగానే పక్కనే ఉన్న ఇతర బైక్‌ రైడర్లు వారిని హెచ్చరించే ప్రయత్నం చేసినా, ప్రేమ జంట ఏమాత్రం పట్టించుకోకుండా తమ రీల్ పనిలోనే మునిగిపోయారు.

ప్రజా రవాణా మాధ్యమాలను అసభ్యత ప్రదర్శనలకు వేదికగా మార్చడమే కాకుండా, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం పట్ల నగర వాసులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ పెరగాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి అనాలోచిత ప్రవర్తనకి సంబంధించిన వీడియోలు వైరల్ కావడం, మరింత మంది యువతను ప్రేరేపించే ప్రమాదం కూడా ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Next Story