- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CV Anand: పాతబస్తీ రౌడీ షీటర్ నగర బహిష్కరణ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్వీట్
మొహమ్మద్ అసద్, కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్, 11 కు పైగా క్రిమినల్ కేసులతో పాటు హింసాత్మక స్వభావం, బెదిరించడం, ప్రత్యర్థుల పై హత్యాయత్నాలు చేసే నేరస్థుడని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మొహమ్మద్ అసద్, కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్, 11 కు పైగా క్రిమినల్ కేసులతో పాటు హింసాత్మక స్వభావం, బెదిరించడం, ప్రత్యర్థుల పై హత్యాయత్నాలు చేసే నేరస్థుడని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా తెలిపారు. 2024 జూన్‌లో అసద్ తన అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడని పేర్కొన్నారు. ఇటీవల మా బృందాలు అతనిని, అతని సహచరులను ఓ హోటల్ సమీపంలో అడ్డుకొని, మరో ప్రత్యర్థి గ్యాంగ్‌పై దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో తుపాకీ, బుల్లెట్స్, కత్తులను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ప్రజల ఫిర్యాదులు, క్షేత్ర స్థాయి విచారణలు, అధికారుల నివేదికల ఆధారంగా అతని చర్యలు శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా ఉన్నట్లు తేలిందన్నారు. దీనితో అతన్ని హైదరాబాద్ నగరం నుంచి ఒక సంవత్సరం పాటు ఎక్స్టర్న్ చేశాం (నగర బహిష్కరణ) అని ట్వీట్ ద్వారా తెలిపారు.






