Cryptocurrency: క్రిప్టో కరెన్సీ మాటున సైబర్ మోసాలు.. ఎలా? సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

సైబర్ నేరాగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ మాటున సైబర్ మోసాలు.. ఎలా? సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crimes PS Hyd City Police) సూచిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ అధికారిక ఎక్స్ ఖాతా (@CyberCrimeshyd) సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ వరుస ట్వీట్లు వేశారు. అందులో ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) మాటున సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అలర్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబులతో భారీగా లాభాలంటే ఆశపడకండని సూచించారు. రోజుల వ్యవధిలోనే డబ్బులు రెట్టింపు అవుతాయంటే అస్సలు నమ్మకండని తెలిపారు. ఆశ చూపి గుర్తు తెలియని వెబ్‌సైట్లలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని సూచించారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో ఫేక్ స్క్రీన్‌ షాట్స్‌ సృష్టించి నమ్మించే యత్నం చేస్తారని తెలిపారు. నెల రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయని కబుర్లు చెబుతారని, పెట్టుబడి పెట్టాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారని వెల్లడించారు. ముందు వెనకా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టొద్దని క్రిప్టో మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

మరో ట్వీట్‌లో (Trading Tips) ట్రేడింగ్ టిప్స్‌తో భద్రంగా ఉండాలని సూచించారు. సోషల్‌ మీడియాను నమ్మి అస్సలు పెట్టుబడులు పెట్టొద్దని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే అత్యాశ ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్‌ల్లో వచ్చే ట్రేడింగ్‌ టిప్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలపై మరో ట్వీట్ చేస్తూ.. మార్కెట్ ధర కంటే తక్కువకే వస్తున్నాయని సోషల్‌ మీడియాలో కనిపించిన లింక్స్ క్లిక్ చేసి చిక్కుల్లో పడొద్దన్నారు.

ప్రముఖ (E-commerce websites) ఈ-కామర్స్ వెబ్‌సైట్లను పోలి ఉండేలా ఫేక్ వెబ్‌సైట్లను క్రియేట్‌ చేసి మోసం చేస్తారని తెలిపారు. ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక పబ్లిక్ వైఫై వాడకంపై మరో ట్వీట్ చేస్తూ.. పబ్లిక్‌ వైఫై వాడుతూ ఆర్ధికలావాదేవీలు అస్సలు చేయోద్దన్నారు. ఉచిత వైఫై వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో ఉండే ఫ్రీ వైఫై వాడటం కోసం క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేసే ముందు నిర్ధారించుకోవాలని కీలక సూచనలు చేశారు.

Next Story