నేడే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం

by Muthe.Rajitha |

పుస్తక ప్రియుల పండగ కార్యక్రమం "హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్" నేటి నుంచి ప్రారంభం కానుంది.

నేడే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : పుస్తక ప్రియుల పండగ కార్యక్రమం "హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్" నేటి నుంచి ప్రారంభం కానుంది. 38వ నేషనల్ బుక్ ఫెయిర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. నేటి నుంచి ఈనెల 29 వరకు 11 రోజులపాటు కొనసాగనున్న ఈ బుక్ ఫెయిర్ నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రతిరోజూ 1 pm నుంచి రాత్రి 9 పీఎం వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుండగా.. వారాంతాల్లో మధ్యాహ్నం 12 pm కి మొదలు కానుంది. ఎంట్రీ ఫీజు రూ.10 ఉండగా.. రచయితలు, జర్నలిస్టులు, పాఠశాల విద్యార్థులకు ప్రవేశం ఉచితం.

ఈ బుక్ ఫెయిర్ లో తెలుగుతోపాటు జాతీయ అంతర్జాతీయ పుస్తకాలతో మొత్తం 365 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. ప్రతిఏటా 10 లక్షలకు తగ్గకుండా పుస్తక ప్రియులు పాల్గొనే ఈ బుక్ ఫెస్టివల్ లో ఈసారి 15 లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని బుక్ ఫెయిర్ నిర్వాహకులు పేర్కొన్నారు.

Next Story