HYD : సనత్‌నగర్‌లో ముగ్గురు మృతి కేసులో వీడిన మిస్టరీ

by Sathputhe Rajesh |

హైదరాబాద్ సనత్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

HYD : సనత్‌నగర్‌లో ముగ్గురు మృతి కేసులో వీడిన మిస్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. సనత్ నగర్ జెక్ కాలనీలో ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఆర్.వెంకటేష్(55), మాధవి(50), హరి(30) నివాసం ఉంటున్నారు. వీరు బాత్ రూమ్‌లో విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కాగా, ఈ ముగ్గురి మృతి కేసులో మిస్టరీ వీడింది. గ్యాస్ ఆధారిత గ్రీజర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడంతో ముగ్గురు మృతి చెందినట్లు తేలింది. నేరుగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడంతోనే ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు.

Next Story