HYD : ఫార్ములా ఈ రేసింగ్‌లో సందడి చేసిన సచిన్, రాంచరణ్, మహేష్ బాబు కొడుకు

by Disha Web Desk 4 |
HYD : ఫార్ములా ఈ రేసింగ్‌లో సందడి చేసిన సచిన్, రాంచరణ్, మహేష్ బాబు కొడుకు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్ సందడి మొదలైంది. హుస్సేన్ సాగర్ తీరంలో రేస్ కార్లు రయ్ మంటూ దూసుకుపోనున్నాయి. శనివారం అసలైన సమరం షురూ కానుండటంతో నగరంలో హడావుడి మొదలైంది. శనివారం ఉదయం 8 గంటలకే ప్రీ ప్రాక్టీస్ మొదలైంది. తర్వాత క్వాలిఫయింగ్ జరగనుంది. అనంతరం 3 గంటల తర్వాత ప్రధాన రేస్‌కు డ్రైవర్లు రంగంలోకి దిగనున్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ రేస్ కొనసాగనుంది.

దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి రేస్ ఈవెంట్ ఇదే కావడంతో పోటీలను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి సెలబ్రెటీలు హాజరవుతున్నారు. ఇప్పటికే హీరో రామ్ చరణ్‌తో పాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, చాహల్, దీపక్ చాహర్ ఈ రేసింగ్ చూసేందుకు వచ్చారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి తదితరులు వచ్చారు. ఈ ఫార్ములా రేసింగ్ కోసం సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరలిరావడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది.ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed