డ్రగ్స్ డెన్‌లుగా మారిన పబ్‌లపై ఈగిల్ పంజా..!

by Bhanu |

డ్రగ్స్ డెన్ లు గా మారిన పబ్ ల సంగతి తేల్చేందుకు ఈగిల్ సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఈగిల్ దర్యాప్తులో డ్రగ్స్ వినియోగదారులు,

డ్రగ్స్ డెన్‌లుగా మారిన పబ్‌లపై ఈగిల్ పంజా..!
X

దిశ, సిటీక్రైం : డ్రగ్స్ డెన్ లు గా మారిన పబ్ ల సంగతి తేల్చేందుకు ఈగిల్ సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఈగిల్ దర్యాప్తులో డ్రగ్స్ వినియోగదారులు, దందా చేసే వారితో లింక్ ఉన్న పబ్ ల ఆర్ధిక మూలాలను పెకిలించేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈ నేపధ్యంలో ఇటీవల కొంపల్లి లో డ్రగ్స్ తో దొరికిన మల్నాడు కిచెన్ రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని కేసు దర్యాప్తులో ఈగిల్ పోలీసులు దూకుడిని పెంచారు. ఈ కేసు దరర్యాప్తులో వెలుగు చూసిన పబ్ భాగోతాల పై అధికారులు పంజా విసురనున్నారు.


దీని కోసం ఈగిల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రతి పబ్ కు ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి ఆ పబ్ ఆర్ధిక మూలాలను విచారించనున్నారు. ఈ పబ్ ల యజమానులు, డైరెక్టర్ లతో పాటు ఎవరెవరు వీటిలో భాగస్వాములుగా ఉన్నారో వారందరీ ఆర్ధిక వివరాలను పోలీసులు సేకరించునున్నారు. ఈ పబ్ పెట్టుబడి ఏలా వచ్చింది ఆ తర్వాత నిర్వహించేందుకు ఎంత ఖర్చవుతుంది, ఎంత మంది పెట్టుబడి పెట్టారు, ఆ డబ్బు ఏలా వచ్చిందనే కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్ దందాతో ఏమైనా ఈ పబ్ లలో పెట్టుబడులుగా పెట్టారా వంటి విషయాలను వెలుగు తీసేందుకు ఈగిల్ డైరెక్టర్ దర్యాప్తును పకడ్బందిగా చేపట్టారు.

పబ్ లలో ప్రత్యేక గదులు

ఈగిల్ దర్యాప్తులో హైదరాబాద్ లోని చాలా పబ్ లలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి వాటిలో పబ్ మూసివేసిన తర్వాత నుంచి రాత్రంతా వాటిల్లో డ్రగ్స్ ను సేవించేందుకు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సూర్య అరెస్టు సమయంలో అతను వెల్లడించిన విషయాలతో బయటపడింది. ప్రిజమ్, ఫాం, బర్డ్ బాక్స్, బ్రాడ్ వే, క్వేక్ , క్సోరా పబ్ లలో సూర్య తన స్నేహితులతో కలిసి వీటిల్లో డ్రగ్స్ ను సేవించినట్లు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈగిల్ పోలీసులు ఇప్పుడు ఈ పబ్ ఆర్ధిక లావాదేవిలను జల్లెడ పడుతున్నారు. దర్యాప్తులో భాగంగా సూర్యతో పాటు ఈ పబ్ లతో సంబంధం ఉన్న వారందరూ ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల రూపాయాలకు పైన డ్రగ్స్ ను నైజీరియన్ ముఠాలు,గోవా, ముంబాయి, బెంగళూరు, ఢిల్లీ ల నుంచి తీసుకువచ్చినట్లు ఈగిల్ పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన అన్ని లావాదేవిల ఆధారాలను సేకరించే పనిలో ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు.

డ్రగ్స్ దందాతో పబ్ లు ఏర్పాటు.?

కొంత మంది డ్రగ్స్ కు అలవాటై ఆ తర్వాత వారు దందాను చేయడం మొదలు పెట్టి భారీగా డబ్బులు సంపాదించడంతో ఆ వచ్చిన ఆదాయంతో హైదరాబాద్ లో పబ్బులు పెట్టారని ఈగిల్ అధికారులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ ను సేవిస్తున్న పబ్ లలో కేవలం ఇంటిరీయర్ కోసమే దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే అంత డబ్బు ఏలా వచ్చిందని ఆరా తీస్తున్న తరుణంలో డ్రగ్స్ దందా ద్వారానే సంపాదించారనే అనుమానాలు నెలకున్నాయి.

దీనిని నిర్ధారించాడానికి ఈగిల్ అధికారులు ఇప్పుడు ఆర్థికపరమైన కోణంలో దర్యాప్తును వేగవంతం చేసి పబ్ లపై పంజా విసురనుంది. డ్రగ్స్ దందాతో ముడిపడి ఉన్న పబ్ ల లెక్కలను కచ్చితంగా తేల్చి ఒక నెలలో అందరీని జైలు కు పంపేందుకు ఈగిల్ యాక్షన్ ప్లాన్ ను తయారు చేసుకుందని స్పష్టమవుతుంది. వీటి వెనకాల రాజకీయ ప్రముఖులు, అధికారులు, కార్పోరేట్ బిజినెస్ మెన్ లు ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఈగిల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story