- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : ఓటర్ స్లిప్‌పై పార్టీ గుర్తు.. MIM క్యాండిడేట్ హల్‌చల్
ఓటర్ స్లిప్‌పై పతంగి గుర్తు ప్రచురించి ఎంఐఎం అభ్యర్థి హల్ చల్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఓటర్ స్లిప్‌పై పతంగి గుర్తు ప్రచురించి ఎంఐఎం అభ్యర్థి హల్‌చల్ చేశారు. యాకుత్ పురా నియోజకవర్గం లో పోలింగ్ స్లిప్పులపై పార్టీ గుర్తు ప్రింట్ చేసి ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ మేరాజ్ పంచడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. డైరెక్ట్‌గా ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసి ఇంటింటికి వెళ్లి ఓటరు పేరు, వివరాలతో ప్రింట్ చేసి పంచుతున్నారు.
స్లిప్‌పై పతంగి గుర్తు, ఓటరు వివరాలు, పోలింగ్ బూత్ వివరాలున్నాయి. ఓటర్లకు పంచిన స్లిప్పుల ఆధారంగా ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, అసలు ఓటర్ల డేలా ఎలా సేకరించారని అంజదుల్లా మండిపడ్డారు. అసలు ఓ యంత్రం తయారు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఈసీ, జీహెచ్ ఎంసీ కమిషనర్లకు కంప్లైంట్ చేశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






