HYD: మణికొండలో మంజీరా పైప్‌లైన్ బ్లాస్ట్.. భారీగా ఇళ్లలోకి చేరిన నీరు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-17 03:46:33  IST  )

మణికొండలో మంజీరా పైప్‌లైన్ బ్లాస్ట్ అవ్వడంతో సమీపంలోని అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేసింది. దీంతో NDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.

HYD: మణికొండలో మంజీరా పైప్‌లైన్ బ్లాస్ట్.. భారీగా ఇళ్లలోకి చేరిన నీరు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని మణికొండ ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన నీటి సరఫరా మార్గమైన మంజీరా పైప్‌లైన్ ఒక్కసారిగా పేలిపోవడంతో (Pipe Line Blast) స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైప్‌లైన్ పేలిన ధాటికి నీరు భారీ ఎత్తున ఎగసిపడి నీరు వరదలా రోడ్లపైకి చేరి సమీపంలోని ఇళ్లలోకి చేరాయి. నీటి ఉధృతి కారణంగా సమీపంలోని రెండు అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లు పూర్తిగా నీటితో నిండిపోయాయి.

ఈ హఠాత్పరిణామంతో పార్కింగ్‌లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్లార్లలో నిండిన నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు తోడుతున్నారు. గత 2 గంటలుగా అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మంజీరా నీటి సరఫరాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Next Story